రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తాను ఆనాడే చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయన మాట్లాడారు. బీజేపీ- టీడీపీలు ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు కుదిరిందని అన్నారు. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారని, విశాఖలో రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ చేయడంపై స్పష్టమైన హామీలు ఇచ్చారని కూడా చంద్రబాబు చెప్పారు. విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్రంపై తప్పకుండా ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు. నీతి, నిజాయితీలతో ఉండే పార్టీ తమదని, రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Mar 10 2015 2:50 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement