చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు | CBI raids chidambaram, his son Karti Chidambaram houses | Sakshi
Sakshi News home page

May 16 2017 9:11 AM | Updated on Mar 20 2024 11:49 AM

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నివాసంలో మంగళవారం సీబీఐ సోదాలు చేసింది. చెన్నైలో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 2008లో ఇంద్రాణి ముఖర్జీయకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అనుమతులు ఇప్పించిన కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. చిదంబరం టార్గెట్‌గా ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement