తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విముక్తి దినం జరపకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేసీఆర్ ఎవరంటే భయపడుతున్నారని, ఒవైసీ అంటే ఆయన భయపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఎవరికీ భయపడటం లేదని, తమను విముక్తి దినం జరపకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు.