రెండవ సారి ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి అమ్మకానికి పెట్టాడు. ఐసిడిఎస్ అధికారులు అడ్డుకొని ఆ చిన్నారిని శిశువు విహార్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివారు గ్రామం బుగ్గతండాకు చెందిన సరోజ - సుధాకర్లకు మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. మళ్లీ ఇటీవలే వారికి మరో ఆడపిల్ల పుట్టింది. సుధాకర్ బిడ్డను పెంచడం భారం అనుకున్నాడు. బిడ్డను పారవేద్దామని అనుకున్నాడు. ఈ విషయం తెలిసి పెద్దలు నచ్చజెప్పారు. బంగారు తల్లి పథకం వర్తిస్తుందని చెప్పారు. అయినా అతనిలో మార్పులేదు. ఆ బిడ్డను వదిలించుకోవాలని చూశాడు. హైదరాబాద్కు చెందిన ఒకరికి ఆ బిడ్డని పది వేల రూపాయలకు అమ్మడానికి ఆ తండ్రి సిద్ధపడ్డాడు. విషయం తెలిసిన స్థానిక అంగన్వాడీ టీచర్ సహకారంతో ఐసిడిఎస్ అధికారి సుగుణ అమ్మకాన్ని అడ్డుకున్నారు. ఆ బిడ్డని శిశువు విహార్కు తరలించారు. బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సుగుణ చెప్పారు. ఇటువంటి సంఘటనలను అడ్డుకోవడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు నిరోధించడానికి, ఆడపిల్లల అమ్మకాలను అడ్డుకోవడానికి వారి తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నట్లు ఆమె తెలిపారు.
Nov 11 2013 8:44 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement