జిల్లాలోని గుత్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ts 07z 4071 బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 25 మంది స్వల్పంగా గాయపడ్డారు.