లోక్సభలో ఆందోళనకు దిగిన 11మంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందున సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్కు లోక్సభ తీర్మానం చేసింది. లోక్సభలో ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కమల్నాథ్ గురువారం ప్రవేశపెట్టారు. సస్పెండ్ అయినవారిలో ఏడుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. కాగా టీడీపీ ఎంపీల సస్పెన్షన్‌ను సుష్మాస్వరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. సభ సజావుగా నడపటం లేదంటూ ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్ వైఖరిని సుష్మా తప్పుబట్టారు. తాము మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చినా ఇంత రాద్ధాంతం జరగలేదని ఆమె అన్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలను మరో అయిదు రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Aug 22 2013 1:17 PM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement