రొమాంటిక్ కామెడీగా 'జ్యో అచ్యుతానంద' | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ కామెడీగా 'జ్యో అచ్యుతానంద'

Published Thu, Aug 18 2016 7:21 PM

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీని ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే పేరుతో మరో రొమాంటిక్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. బుధవారం ఈ సినిమా టీజర్ విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement
Advertisement