మళ్లీ తెరపైకి లింగా వివాదం | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి లింగా వివాదం

Published Thu, May 28 2015 12:50 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్ర సమస్యకు ముగింపు కార్డు పడలేదు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి పోరుకు తయారవుతున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే.