ప్రమోషనల్ ఆఫర్ల కింద ఇప్పటిదాకా ఉచితంగా లభిస్తున్న రిలయన్స్ జియో డేటా సర్వీసులకు ఏప్రిల్ 1 నుంచి చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుత యూజర్లు మాత్రం వన్ టైమ్ జాయినింగ్ ఫీజు కింద రూ. 99 కడితే నెలకు రూ. 303 టారిఫ్‌తో ప్రస్తుత ఉచిత ప్రయోజనాలను మరో 12 నెలల పాటు పొందవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు. జియో సర్వీసులు ప్రారంభించిన తర్వాత 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్ల మైలురాయిని అధిగమించినట్లు ఆయన చెప్పారు.