మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | petrol-price-cut-by-91-paise-a-litre-diesel-by-84-paise | Sakshi
Sakshi News home page

Nov 30 2014 7:59 PM | Updated on Mar 21 2024 6:13 PM

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గింది. ఈ తగ్గిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఎనిమిదో సారి, డీజిల్‌పై నాల్గోసారి తగ్గించనట్లయ్యింది. ఈ నవంబర్ మొదట్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.41 పైసలు తగ్గగా, డీజిల్ పై లీటర్ కు రూ.2.21 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు మరోసారి డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించాయి. ఈ తాజా సవరణతో పెట్రోల్ పై మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 10.27 పైసలు తగ్గినట్లయ్యింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement