ప్రముఖ ఇంటర్నెట్ వ్యవస్థలను సెబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్త తాజాగా కలకలం రేపుతోంది. ప్రముఖ ట్విట్టర్, అమెజాన్ సహా ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ముఖ్యమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురైనట్టు తెలుస్తోంది. గత రెండురోజులుగా వివిధ వెబ్ సైట్లు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్)దాడికి గురవుతున్నట్టు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రకటించింది. అలాగే డౌన్ డిటెక్టర్. కామ్ వెబ్ సైట్ అమెరికా, యూరప్ మీదుగా ఈ దాడి జరిగిందంటూ కొన్ని మ్యాప్ లను కూడా పోస్ట్ చేసింది. దీనిపై అమెరికా ఫెడరల్ బ్యూరోఆఫ్ ఇన్వెస్టిగేషన్ , డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విచారణ మొదలు పెట్టింది.