ప్రొద్దుటూరు: అధికార బలంతో టీడీపీ నేతలు ప్రత్యర్థులను బలవంతంగా పోటీ నుంచి తప్పిస్తూ పంచాయతీ ఎన్నికలను సైతం ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో 16 వేల ఓట్లు ఉండగా, ఏళ్ల తరబడి ఇక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్ స్థానానికి నలుగురు, 20 వార్డులకు 40 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేశారు. పథకం ప్రకారం నలుగురు సర్పంచ్ అభ్యర్థులను, పది వార్డుల్లో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించారు. ప్రస్తుతం 11 నుంచి 20వ వార్డు వరకు ఉన్న పది మందిని కూడా తప్పుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ వర్గీయులు ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో.. ఆ 10 మంది వార్డు అభ్యర్థులు ఊరు విడిచి 500 కిలోమీటర్ల దూరంలో క్యాంపునకు వెళ్లారు.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాకే తిరిగి వస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. తాము ఉన్న లొకేషన్ ఆధారాలను ఎన్నికల అధికారులకు పంపామని తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఫోర్జరీ సంతకాలతో అభ్యర్థులను ఉపసంహరించినట్లు ప్రకటిస్తే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
మహాశయా మన్నించు..
నీవు రాసిన రాజ్యాంగానికి చోటు లేదంటున్నారు..
లోకేష్ రెడ్‌బుక్‌కే గ్రీన్ కార్పెట్ పరిచారు..
మంచి వైపు నీవు చూపించే ‘వేలు’ కన్నా..
రెండు కళ్ల సిద్ధాంతానికి.. వెన్నుపోటుకు గుర్తుగా
బాబోరు చూపించే రెండు వేళ్లే వాళ్లకు మిన్న..
అంబేడ్కరా... మీరు ప్రజలకు ఓటు హక్కు ఇస్తే...
చంద్రబాబేమో వెన్నుపోటు పొడిచారు..
మీరు ప్రజాస్వామ్యానికి పటిష్ట పునాది వేస్తే..
చంద్రాలం సారు ఎప్పుడో సమాధి చేశారు..
మహాశయా..మన్నించు!!


