రాత్రివేళ హైడ్రామా.. తీవ్ర ఉద్రిక్తత! | - | Sakshi
Sakshi News home page

రాత్రివేళ హైడ్రామా.. తీవ్ర ఉద్రిక్తత!

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

– వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి గెలిచినా.. రీకౌంటింగ్‌ పేరుతో టీడీపీ వేధింపు

బి.కోడూరు: మండలంలోని పెద్దుళ్లపల్లెలో గురువారం పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. సాయంత్రం కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు సిద్దమూర్తి లక్ష్మీదేవి 11 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఆర్‌ఓ ప్రకటించారు. పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో బయలుదేరగా, వంద మీటర్ల దూరంలోనే స్థానిక, మండల, నియోజకవర్గ కూటమి నేతలు అడ్డుకుని రీకౌంటింగ్‌ చేయాలంటూ ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా పోటీగా బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి 7 గంటలకు టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి చేరుకుని ఆర్డీఓతో చర్చించగా, ఆయన రీకౌంటింగ్‌కు ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్యరెడ్డి, కె.రమణారెడ్డి అధికారుల తీరును నిలదీశారు. ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ నాలుగు గంటల తర్వాత రీకౌంటింగ్‌ ఎలా చేస్తారని, అధికారులపై నమ్మకం లేదని, జాయింట్‌ కలెక్టర్‌ లేదా కోర్టు జడ్జి సమక్షంలోనే రీకౌంటింగ్‌ జరపాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement