– రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్ల ధర్నా
పోరుమామిళ్ల: పోరుమామిళ్ల మండలంలోని తిమ్మారెడ్డిపల్లెలో గురువారం ఉదయం టీడీపీ వర్గీయులు పోలింగ్ బూత్‌ను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఓటర్లు ఆరోపించారు. ఓటు వేయడానికి వెళ్లిన వారి వద్ద స్లిప్పులు లాక్కుని.. ‘మీ ఓటు మేమే వేస్తాం, మీరు వెళ్లండి’ అంటూ బెదిరించి పంపించేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఓటర్లకు రక్షణ కల్పించడంలో విఫలమవడంతో తిమ్మారెడ్డిపల్లె, కప్పలపల్లె ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు సుమారు 250 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రీపోలింగ్ నిర్వహించి, స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.


