కె.బోయినపల్లిలో ఎన్నికల అధికారుల పచ్చపాతం ! | - | Sakshi
Sakshi News home page

కె.బోయినపల్లిలో ఎన్నికల అధికారుల పచ్చపాతం !

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

● కూటమి అభ్యర్థికి ఆర్వో

వత్తాసు పలికారంటూ ఆరోపణ

● నిరసనగా ఎన్నికలను బహిష్కరించిన ఐదుగురు సర్పంచ్‌ అభ్యర్థులు

రాజంపేట రూరల్‌: రాజంపేట మండలంలో గురువారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికారు లు, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికారని విపక్ష అభ్యర్థులు ఆరోపించారు. మండలంలోని కె.బోయినపల్లి పంచాయతీ సర్పంచ్‌ పదవికి ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి బలపరిచిన అభ్యర్థి గొట్టిముక్కల పెంచలరావు (ఉంగరం గుర్తు), వైఎస్సార్‌సీపీ మద్దతుదారు బొడిచెర్ల శివయ్య (టీ కప్‌ గుర్తు) సహా మరో నలుగురు పోటీ పడ్డారు.

● పంచాయతీలోని 3 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. కేంద్రాల బయట పెట్టిన బోర్డులపై కూటమి అభ్యర్థి ‘ఉంగరం’ గుర్తును కలర్‌లో పెద్దదిగా ముద్రించి, మిగిలిన అభ్యర్థుల గుర్తులను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చిన్నవిగా, సరిగా కనిపించకుండా ఏర్పాటు చేశారని ప్రత్యర్థి అభ్యర్థులు మండిపడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద కేవలం ఉంగరం గుర్తు అభ్యర్థి పేరు మాత్రమే రాసి, మిగతా వారి పేర్లను విస్మరించారని ఆరోపించారు. దీనిపై ఆర్వో యూనస్‌, రూట్‌ ఆఫీసర్‌ శంషాద్‌ బేగం, ఇన్‌చార్జి ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ అభ్యర్థులు బొడిచెర్ల శివయ్య (టీ కప్‌), మాడ ధనలక్ష్మి (మంచం), మేరువ పద్మ (కత్తెర), మేరువ వరలక్ష్మి (బుట్ట), భీంశెట్టి వెంకటేశ్వరరావు (వంకాయ) ఎన్నికలను బహిష్కరించి, రీపోలింగ్‌ నిర్వహించాలని ఆర్వోకు ఫిర్యాదు చేశారు.

ఆకేపాడులో బయటి వ్యక్తులకు దేహశుద్ధి..

మరోవైపు మండలంలోని ఆకేపాడు పోలింగ్‌ కేంద్రం వద్దకు సుమారు 25 మందికి పైగా బయటి వ్యక్తులు (టీడీపీ శ్రేణులు) చొరబడటాన్ని గమనించిన గ్రామస్తులు వారిని నిర్బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే రోళ్లమడుగు, ఆర్‌.బుడుగుంటపల్లె, బాలరాజుపల్లె గ్రామాల్లోకి ప్రవేశించిన రాజంపేటకు చెందిన అల్లరి మూకలను స్థానికులు హెచ్చరించి వెనక్కి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement