– దళిత మహిళా సర్పంచ్ అభ్యర్థి యశోదమ్మను అడ్డుకున్న పోలీసులు
సంబేపల్లె: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంబేపల్లె దళిత మహిళా సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, వార్డు అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని, గేటుకు తాళం వేశారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. వీరితో పాటు నాయకుడు వీవీ ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలను బలవంతంగా స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. టీడీపీ మూకల జోక్యంతో ఎస్‌ఐ రవికుమార్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే అభ్యర్థులను పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉంచారని విమర్శిస్తూ.. సర్పంచ్ అభ్యర్థి యశోదమ్మ, వార్డు అభ్యర్థులు ఎన్నికలను బహిష్కరించారు. మరోవైపు శెట్టిపల్లె గ్రామం సదిపిరాళ్లపల్లిలో ఓటర్లను అడ్డుకోగా, శెట్టిపల్లి కస్పాలో గ్రామస్తులు నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయగా, రమేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై దాడులు జరిగాయి.


