కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘రెవెన్యూ స్పోర్ట్స్ మీట్–2026’శనివారం ఉత్సాహంగా జరిగింది. ఉద్యోగుల్లో ఐకమత్యం, క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహించారు.కడప ఆర్‌డీఓ కె. మల్లికార్జునుడు, డిప్యూటీ కలెక్టర్లు బి.శివరామిరెడ్డి, రంగస్వామి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విధి నిర్వహణతో పాటు క్రీడలు ఆరోగ్యానికి, పరస్పర సత్సంబంధాలకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, త్రోబాల్, చెస్, క్యారమ్స్ వంటి 6 విభాగాల్లో పోటీలు జరిగాయి. వివిధ మండలాల ఉద్యోగులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కేపీ రోనాల్డ్ శామ్యూల్‌రాజ్, కార్యదర్శి ఎస్.ప్రసాద్ రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


