రబీ రుణ లక్ష్యం ఖరారు | - | Sakshi
Sakshi News home page

రబీ రుణ లక్ష్యం ఖరారు

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

అర్హతను బట్టి ...

రబీలో పంటలకు రుణ పరిమితి ఇలా...

● పంటను బట్టి రుణ పరిమితి

● జిల్లాలో మమ్మురంగా శనగలు పంపిణీ

● వరుణుడి కోసం రైతన్నలు ఎదురు చూపు

కడప అగ్రికల్చర్‌: రబీ సీజన్‌ ప్రారంభమై పదిరోజులైంది. ఖరీఫ్‌ నిరాశజనకంగా ముగియడంతో రైతలు ఆశలన్నీ రబీపైనే ఉన్నాయి. జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 1,43,441 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లుగా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో అత్యధికంగా 75,658 హెక్టార్లలో శనగపంట సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి 52300 క్వింటాళ్ల శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఈ ఏడాది రబీ సీజన్‌ పంటల సాగు కోసం రూ. 4652 కోట్ల పంట రుణాలను రైతులకు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జిల్లాలో 37 కరువు మండలాలుగా ప్రకటన...

జిల్లాలో ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్రవర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 40 మండలాలకుగాను సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాలు మినహా మిగతా 37 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా మరో 23 మండలాలు కొంత తీవ్రత తగ్గించి కరువు మండలాల ప్రకటన చేసింది. కరువు మండలాలు ప్రకటించిన మండలాలకు ఎలాంటి లబ్థి చేకూరుస్తారనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

జిల్లాలో రబీ సీజన్‌కుగాను రూ. 4652 కోటు రుణాలు పంపిణీ చేయాల్సిందిగా లక్ష్యం పెట్టుకున్నాం. అర్హతను బట్టి రైతులందరిని పంట రుణాలను అందిస్తాం. అలాగే ఖరీఫ్‌లో కూడా రూ. 6778 లక్షలకుగా దాదాపు రైతులందరికీ పంట రుణాలను ఇచ్చాం. రైతులు పంటలసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదన్నదే మా లక్ష్యం. – జనార్థనం,

లీడ్‌ బ్యాంకు డిస్ట్రిక్‌ మేనేజర్‌

పంట ఇచ్చే రుణం (ఎకరాకు)

వరి రూ. 52,000 – 60,000

శ నగ రూ. 35,000 – 38,000

వేరుశనగ రూ. 41,000 – 44,000

మినుము రూ. 27,000– 31,000

అరటి రూ. 88000 – 1,50,000

చీని రూ. 70,000 –75,000

పసుపు రూ. 1,17000 – 1,30,000

నిమ్మ రూ. 75,000 –78,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement