కడప అర్బన్: ప్రజలకు మానసిక ఆరోగ్యం ముఖ్యమని... ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కడప రిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన ర్యాలీని జీఎంసీ (రిమ్స్) ప్రిన్సిపల్ టి.జమున, ఐఎంహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.వెంకట్రాముడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ థీమ్ – రియల్ వాయిస్– రియల్ ఛేంజ్’ అని తెలిపారు. కడపలోని జిల్లా న్యాయసేవాధికారసంస్థ నుంచి పారాలీగల్ వలంటీర్‌లు, వైద్యులు,వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.


