● దసరా వేడుకలకు ముస్తాబైన ప్రొద్దుటూరు
● నేటి నుంచి దేవీశరన్నవరాత్రి
మహోత్సవాలు ప్రారంభం
ప్రొద్దుటూరు కల్చరల్ : దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరులోని శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం నుంచి 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు ఆదివారం ఉదయం 7.20 గంటలకు వేదపఠనంతో నవగంగ తీర్థములు శ్రీకన్యకాపరమేశ్వరిదేవి ఆలయానికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మవారిశాల నుంచి మంగళవాయిద్యాలతో బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి శ్రీనగరేశ్వరస్వామి ఆలయం నుంచి కన్యకాపరమేశ్వరి దేవి పురాణాన్ని ఆర్యవైశ్యులు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆయా ఆలయ కమిటీ వారు కలశ పూజచేసి వాటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కడప నగరంలోని అమ్మవారి శాల ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. అలాగే కడప విజయదుర్గాదేవి ఆలయంతోపాటు జిల్లాలోని ఇతర ఆలయాలు విద్యుద్దీపాలంకరణతో.. కళ్లు చెదిరే సెట్టింగులతో నవశోభను సంతరించుకున్నాయి.


