బాబోయ్‌.. సీఎం పర్యటనా! | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. సీఎం పర్యటనా!

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

సాక్షి, అన్నమయ్య/వేంపల్లె: ముఖ్యమంత్రి పర్యటనలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. సీఎం చంద్రబాబు సీమ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను అక్కడికి తరలిస్తుండటంతో ఇక్కడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్న మదనపల్లె సభకు, సోమవారం ప్రొద్దుటూరు సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది బస్సులు ఉపయోగించారు. దీంతో గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు.

దోచుకుంటున్న ప్రైవేట్‌ వాహనదారులు

విధుల నిమిత్తం ఉద్యోగులు, చదువు కోసం విద్యార్థులు, సాధారణ పనుల మీద ప్రయాణికులు రోజుకు వేలాదిగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వారం రోజుల్లోనే రెండు సార్లు సీఎం పర్యటనకు బస్సులన్నీ వెళ్లడంతో ఆయా ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్‌ వాహనదారులు ఒక్కో ప్రయాణికునికి దూరాన్ని బట్టి రూ100ల నుంచి రూ.500ల వరకు వసూలు చేస్తున్నారు. కాగా సీఎం సభలకు జనాలు రాకపోవడంతో కొంతమంది కార్యకర్తలకే మద్యం, బిర్యానీప్యాకెట్లతోపాటు నగదు అందించి తరలిచారు. బస్సుల్లో తమ్ముళ్లు మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తూ మద్యం మత్తులో హుషారుగా కనిపించగా, బస్టాండ్లలో ప్రయాణికులకు బస్సులు లేక బేజారెత్తారు.

హడలిపోతున్న ప్రయాణికులు

చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ సీఎం పర్యటన ఉన్నా బస్సులన్నీ అక్కడికే!

4రోజుల క్రితం మదనపల్లె,

నేడు ప్రొద్దుటూరుకు సీఎం

ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిబస్సులు తరలింపు

ప్రయాణికులు, విద్యార్థుల అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement