గంటల తరబడి వేచిచూస్తున్నా | - | Sakshi
Sakshi News home page

గంటల తరబడి వేచిచూస్తున్నా

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

గంటల తరబడి వేచిచూస్తున్నా ఇలా ఇబ్బంది పెట్టడం తగదు

బస్సుల కోసం గంటల తరబడి వేచిచూస్తున్నా. ఈ వారంలోనే మదనపల్లె, ప్రొద్దుటూరులో రెండు ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో బస్సుల న్నీ అక్కడికి పంపితే మాలాంటి ప్రయాణికుల సంగతి ఏమిటి, అసలే అరకొర బస్సులు. వాటి ని కూడా లేకుండా పంపితే మేము గమ్యస్థానా లు చేరుకునేదెట్లా? అధికారులు ఆలోచించాలి.

– పద్మావతి, ప్రయాణికురాలు, వేంపల్లె

సీఎం పర్యటనకు ఆర్టీసీ బస్సులన్నింటినీ తరలించి మాలాంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు. బస్సులను నమ్ముకుని బస్టాండుకు వస్తే ఇక్కడ బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డాం. మరోవైపు ప్రైవేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. పాస్‌ తీసుకున్న విద్యార్థులు కూడా ప్రైవేట్‌ వాహనాలకు డబ్బులివ్వాల్సిన దుస్థితి నెలకొంది.

– శ్రీకాంత్‌ రెడ్డి, ప్రయాణీకుడు, వేంపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement