జమ్మలమడుగు : అసోంలో సంభవించిన వరదల్లో గల్లంతై మరణించిన జమ్మలమడుగు తహసీల్దార్ కాచన వెంకట సాయినాథ్‌రెడ్డి కుమార్తె సాయి చేతన(20)కు ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, గిరిధర్‌రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మూడు రోజుల క్రితం బ్రహ్మపుత్ర నది వరదల్లో సాయి చేతన గల్లంతై మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని సోమవారం పెద్దముడియం మండలంలోని ఎన్‌కొట్టాలపల్లి గ్రామానికి తీసుకువచ్చారు. సాయి చేతన మృతదేహాన్ని చూసి బంధువులు బోరున విలపించారు.
గాయపడిన వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు మండలం శివపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(50) చికిత్స పొందుతూ మృతి చెందాడు. బళ్లారి– కృష్ణపట్నం జాతీయ రహదారి బైపాస్‌పై పొట్టేలు అడ్డం రావడంతో బైక్‌పై నుంచి కిందపడిన విషయం తెలిసిందే. సంఘటనపై మృతుడి బావమరిది గోపవరం మండలం కాలువపల్లెకు చెందిన షేక్ ఖాజావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు.
మినీ లారీ బోల్తా
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ ర హదారిలో కమ్మవారిపల్లె గ్రామ సమీపంలో సో మవారం సాయంత్రం గొర్రెల మందతో ప్రయాణిస్తున్న మినీ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న గంగనారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రొద్దుటూరుకు సుమారు 40 గొర్రెలతో ప్రయాణిస్తున్న మినీలారీ కమ్మవారిపల్లె గ్రామ శి వారులో టైరు పంఛర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలకు తీ వ్ర, మరి కొన్నింటికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాజుపాళెం : మండలంలోని కొర్రపాడు–రాజుపాళెం గ్రామాల మధ్యలో ఓ గ్యాస్ గోడౌన్ వద్ద సోమవారం పెను ప్రమాదమే తప్పింది. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం వైపు వస్తున్న ఆటో గోడోన్ వద్దకు రాగానే రహదారి పక్కనే ఉన్న వంకలో ప్రమాదవశాత్తు పడిపోయింది. అయితే ఆ ఆటోలో ఒక వ్యక్తి మాత్రమే ఉండటంతో చిన్నపాటి గాయాలతో బయట పడినట్లు ఆ దారిలో వెళ్లే వాహనదారులు తెలిపారు. చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు వెళ్లినట్లు తెలిసింది.


