ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలి

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

డీఆర్వో మల్లికార్జునుడు

కడప సెవెన్‌ రోడ్స్‌: ఆర్జీదారుల సమస్యలను గడువులోపు పరిష్కరించాలని డీర్వో మల్లికార్జునుడు అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభాభవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్‌ఓ ఇతర అధికారులు ఆర్జీలు స్వీకరించారు.

● సుండుపల్లి మండలంలో 70 శాతం రైతులు మామిడి తోటల వల్ల జీవనం సాగిస్తున్నారని ఆ మండలానికి చెందిన రామ శ్రీనివాస్‌ తెలిపారు. మామిడి కోతకు వచ్చిన ప్రస్తుత దశలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించి అదుకోవాలని కోరారు.

● బుగ్గవంక డ్యాం కట్టపై అడవిని తలపించేలా కంప చెట్లు పెరిగాయని ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఇందువల్ల రానున్న రోజుల్లో కట్ట తెగిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉందని తక్షణమే కంప చెట్లు తొలగించాలని కోరారు.

● చెన్నూరు మండలంలోని సిరి మెగా టౌన్‌షిప్‌లో తాగునీటి వసతి కల్పించాలని టి. ప్రభాకర్‌రెడ్డి కోరారు.

● తన ఆధార్‌కార్డులోని తప్పులు సరిచేసి ఇళ్లు మంజూరు చేయాలని వేంపల్లికి చెందిన టి. లక్ష్మీదేవి కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుబ్రమణ్యం, డీఆర్‌డీఎ పిడి రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటపతి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement