కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు కల్యాణ వేదికపై ఆశీనులపై స్వామి, అమ్మవార్లు
జమ్మలమడుగు: నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైనా దేవదేవుడి కల్యాణం కన్నులపండువగా సాగింది. బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతికి చెందిన పండితులు వేదమంత్రాలతో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. దేవదేవుడి కల్యాణం వీక్షించడానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సర్వభూపాలుడిపై ఊరేగింపు...
నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాలుడి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేడు రథోత్సవం...
బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నిమిషాలకు స్వామి వారికి ప్రత్యేక అలంకారంతోపాటు పూజల అనంతరం 8గంటల నుంచి ఆలయ ప్రాంగణం నుంచి స్వామి వారి రథోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


