ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవ కుమార్‌

Feb 4 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:13 AM

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవ కుమార్‌

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవ కుమార్‌

ఆర్టీసీ కడప జోన్‌ ఈడీగా రాఘవ కుమార్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఆర్టీసీ కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా మంగళవారం ఎస్‌టీపీ రాఘవకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. మొన్నటివరకు ఈడీగా పనిచేసిన పైడి చంద్రశేఖర్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పనిచేస్తున్న రాఘవకుమార్‌ను పదోన్నతిపై కడప ఈడీగా నియమించారు. ఈయన మొదట 1988లో ఆర్టీసీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1990–93లో నరసరావుపేట డీఎంగా, 1993–96లో ఈస్ట్‌ గోదావరి జిల్లా రాజోలు డీఎంగా పనిచేశారు. 1996–99లో విజయవాడలోని జోనల్‌స్టోర్‌లో, 1999–2004లో ప్రధాన కార్యాలయంలో పర్చేజ్‌ ఆఫీసర్‌గా, 2004–2007లో ప్రొద్దుటూరు డీవీఎంగా, 2007–19లో ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ ఆఫ్‌ స్టోర్‌లో పనిచేశారు. 2019లో ఈస్ట్‌ గోదావరి డిప్యూటీ సీఎంఈగా, 2020–21లో గుంటూరు రీజినల్‌ మేనేజర్‌గా, 2022–24లో విజయవాడలోని కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌లో పనిచేశారు. 2025 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పనిచేస్తూ పదోన్నతిపై కడపకు ఈడీగా వచ్చారు. నూతన ఈడీ మీడియాతో మాట్లాడుతూ కడప జోన్‌లో ఎనిమిది జిల్లాలు ఉన్నాయన్నారు. అనంతరం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు యూనియన్‌ నాయకులు నూతన ఈడీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement