సేవామూర్తి.. వైఎస్ జయమ్మ
● సర్పంచ్‌గా సేవలు..
రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవ
● నేడు వైఎస్ జయమ్మ 20వ వర్ధంతి
పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే అందరికీ అన్ని పంచి ఇచ్చిన అమ్మ వైఎస్ జయమ్మ. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ. 1999 ప్రాంతంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడు అన్నం పెట్టాలని భావించిన వైఎస్ జయమ్మ... అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 1995నుంచి 2000వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన ఆమె అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. వైఎస్ జయమ్మ తన జీవితాంతం నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. 2006 జనవరి 25న వైఎస్ జయమ్మ తుదిశ్వాస వదిలారు.
వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్న కుటుంబ సభ్యులు
దివంగత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ 20వ వర్ధంతి కార్యక్రమాలు ఆదివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. వైఎస్ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
భర్త వైఎస్ రాజారెడ్డితో వైఎస్ జయమ్మ(ఫైల్)
మహానేత వైఎస్‌ఆర్‌తో వైఎస్ జయమ్మ(ఫైల్)
సేవామూర్తి.. వైఎస్ జయమ్మ
సేవామూర్తి.. వైఎస్ జయమ్మ


