నకిలీ విత్తనాలతో నష్టాలు
ప్రొద్దుటూరులోని ఒక విత్తనాల షాపు నుంచి మినుము విత్తనాలు తెచ్చి మూడు ఎకరాల్లో పంటను సాగు చేశా. తీరా కాపునకు వచ్చేలోపు పూత,పిందె సరిగా రాలేదు. దీంతో దిగుబడి బాగా తగ్గింది. మా బంధువులు మూడు ఎకరాల్లో మినుముసాగు చేస్తే 22 నుంచి 24 క్వింటాల దిగుబడి వచ్చింది. నాకుమాత్రం మూడు ఎకరాలకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బాగా నష్టపోయాను.
– చందా గోవిందరెడ్డి, రైతు, ఏటూరు గ్రామం
రూ.లక్ష నష్టపోయా
గ్రామంలోని చాలా మంది రైతులు దువ్వూరుకు వెళ్లి ఒక డీలర్ వద్ద మొక్కజొన్న విత్తనాలు తెచ్చుకుని, 30 ఎకరాల్లో పంట సాగు చేశారు. సాగు చేసి చాలా రోజులవుతున్నా ఒక రైతుకు సంబంధించిన పంట మొలకెత్తలేదు. నేను 6 ఎకరాల్లో లక్ష రూపాయలు ఖర్చుపెట్టి మొక్కజొన్న సాగు చేశా. మొలకే ఎత్తలేదు. బాగా నష్టపోయా. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు వచ్చి పరిశీలించారు. శాస్త్రవేత్తలను పిలిపిస్తామని, పంటను దున్నేయవద్దని చెప్పారు. ఇలాగే ఉంచితే సీజన్ అయిపోతుంది.ఏం చేయాలో అర్థం కావడం లేదు. – జ్యోతి రాజు,
వెంకటాయపల్లె, సిద్దవటం మండలం
లొపాలు ఉంటే సరిదిద్దాలి...
గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న అగ్రిలాబ్ నిర్వహణలో లోపాలు ఉంటే సరిిదిద్ది కొనసాగాంచాలే కానీ మూసియేడం సబబుకాదు. వీటిని ఉపయోగించుకుని ఎందరో రైతులు విత్తనాల నాణ్యతను పరిశీలించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయడం సరికాదు. అన్నింటిని మూపివేస్తూ పోతే కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగ మవుతుంది.
– మురళీమోహన్‌రెడ్డి, రైతు, సుంకేసుల
నకిలీ విత్తనాలతో నష్టాలు
నకిలీ విత్తనాలతో నష్టాలు


