విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
రాజంపేట : బాలికా చట్టాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని కడప పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం జవహర్ నవోదయ విద్యాలయంలో మండల న్యాయసేవాధికారసంస్థ (రాజంపేట) ఆధ్వర్యంలో జాతీయబాలికల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నా రు. జువైనల్ జస్టిస్ యాక్టు, చైల్డ్ మ్యారేజిస్ యాక్ట్ చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ గంగాధర్, విద్యార్ధులు, నవోదయ జవహర్ విద్యాలయ సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.
కడప పోక్సో కోర్టు న్యాయమూర్తి
ఎన్.ప్రవీణ్‌కుమార్


