ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్‌కి పంచామృతాభిషేకం నిర్విహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం గర్భాలయంలోని మూల విరాట్‌కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


