ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
చాపాడు : మండలంలోని పల్లవోలు గ్రామం రజక కాలనీకి చెందిన గుప్పోళ్ల గురుప్రసాద్ (23) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన గురుప్రసాద్ 8 ఏళ్ల క్రితం తన మేనమామ ఊరైన పల్లవోలులో స్థిరపడి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం నుంచి యువతితో ప్రేమ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇరువురు విడిపోయారు. మనస్థాపం చెందిన గురుప్రసాద్ శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
సుండుపల్లె : మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం కలకలం రేపుతోంది. సుండుపల్లె గ్రామానికి చెందిన కరిష్మా (4) ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దండు స్వైర విహారం చేస్తున్నా వాటి కట్టడికి పంచాయతీ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు అలసత్వం వదిలి కుక్కల భారం నుంచి విద్యార్థులను చిన్నపిల్లలను రక్షించాలని కోరుతున్నారు.
మృత్యువు పిలిచింది
మైదుకూరు : ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరు మున్సిపాలిటీలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి (55) మృతి చెందాడు. ఈయన పచ్చిమిర్చి వ్యాపారం చేసేవాడు. వ్యాపార నిమిత్తం శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు మీదుగా వెళ్లే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో విజయవాడకు బయల్దేరాడు. బస్సు కనిగిరి దాటగానే వెనుక సీటులో ఉన్న జనార్దన్ రెడ్డి ముందుకొచ్చి క్లీనర్ సీటులో కూర్చున్నాడు. అక్కడున్న క్లీనర్‌ను కాసేపు వెనక సీటులో కూర్చోవాలని అభ్యర్థించాడు. కాసేపటికే రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గూడ్స్ వాహనంలోని సరుగుడు కొయ్య క్లీనర్ సీటులో కూర్చుని ఉన్న జనార్ధన్‌రెడ్డి ఛాతిలోకి దూసుకెళ్లింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృత్యువు పిలిచినందువల్లే వెనుకనున్న ఆయన ముందు వైపు ఉన్న సీటులోకి వచ్చారని తోటి ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా పోస్టుమార్టం అనంతరం జనార్ధన్‌రెడ్డి మృతదేహాన్ని శనివారం సాయంత్రం చిన్నయ్యగారిపల్లెకు తీసుకొచ్చారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి, మండలంలో కుక్కల స్వైర విహారం
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య


