23న మెగా జాబ్ మేళా
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక రాణి తిరుమలదేవి డిగ్రీ కాలేజీలో ఈనెల 23న శుక్రవారం ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో డోన్ ఐటీ సొల్యూషన్స్, జోయాలుక్కస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కియా ఇండియా, ఆల్ డిక్సన్ యంగ్ ఇండియా, ఏవీ స్మాల్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర అనేక సంస్థలు పాల్గొంటాయని ఆయన వివరించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ చదివిన ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు స్కిల్ డెవలప్‌మెంట్ కో–ఆర్డినేటర్ దినేష్ మొబైల్ నంబర్ 95816 70585 సంప్రదించాలని కోరారు.
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాలులో స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సుగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 లోని రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం 42 మందికి 32 మంది పదోన్నతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల సీనియారిటీ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, ఆఫీసు సూపరిండెంట్ శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
కడప రూరల్: కడప నగరం నెహ్రునగర్‌కి చెందిన సూరజ్ కృష్ణ గ్రీనరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కుంచం రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సామాజిక పారిశ్రామికవేత్త అవార్డును స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఐటీసీ పేపర్ బోర్డ్ ఆధ్వర్యంలో వావ్ కార్య క్రమంలో భాగంగా అవార్డులను ప్రదానం చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజర య్యా రు. ఈ సందర్భంగా గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో పాటు ఐటీసీ సంస్థ ప్రతినిధి శుభ శంకర్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డును స్వీకరించిన రామచంద్రయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలి, సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో కార్యక్రమాలను రూపొందించామన్నా రు. వ్యర్ధాలు ఒక సమస్య కానే కాదని, వాటిని సరైన విధంగా వినియోగిస్తే శ్రేయస్కరంగా ఉంటుందని భావించామన్నారు. ఆ నమ్మకంతోనే స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణలో విజయం వైపు అడుగులు వేసినట్లుగా తెలిపారు. ఈ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఉమాకాంత్, సత్య శ్రీనివాస్, ఏజీఎస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ప్రభుత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.
23న మెగా జాబ్ మేళా


