దీనీ ఇస్తెమా ఏర్పాట్ల పరిశీలన
కడప కార్పొరేషన్: కడప నగర శివార్లలోని కొప్పర్తిలో ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న దీనీ ఇస్తెమా ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మేయర్ పాకా సురేష్ కుమార్‌లతో కలిసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దీని ఇస్తెమా అధ్యాత్మిక సభకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు డా. సొహైల్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మైనార్టీ విభాగం అధక్షుడు మదీనా దస్తగిరి, కార్పొరేటర్లు షఫీ, అజ్మతుల్లా, అరీఫుల్లా బాష, షంషీర్, బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు సేవ చేసే అవకాశం :
డీపీఓ రాజ్యలక్ష్మి
కడప సెవెన్‌రోడ్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తబ్లిగీ జమాత్‌కు సంబంధించి దీనీ ఇస్తేమా కడపలో జరగనున్న తరుణంలో వారికి తమవంతుగా సేవ చేసే అవకాశం లభించిందని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు, జిల్లా పంచాయతీకి పరిశుభ్రత బాధ్యత అప్పగించారన్నారు. గరం, జిల్లా, రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించాలని ఆమె కోరారు. నగరం, జిల్లా, రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించాలని ఆమె కోరారు.


