పెండింగ్ పనులను పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేసి.. ప్రారంభం కాని పనులను రద్దు చేయాలన్నారు. అలాగే ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ఎంపికై న మండలాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు.
ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్‌ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని, స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక రేట్స్‌ను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని ఇసుక రీచులను పరిశీలంచాలని ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో త్వరలో అధిక సంఖ్యలో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని, భవిష్య అవసరాలకు సరిపడా ఇసుక నిల్వలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా మారేళ్ల మడక, కొండవాండ్ల పల్లె, సంబంటూరు, వెంకాయపల్లెలలో నాలుగు ఇసుక రీచులను గుర్తించామన్నారు.
సోలార్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలి
కడప సెవెన్‌రోడ్స్: ఏపీఎస్పీడీసీఎల్, నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనర్జీ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అన్నిరకాల పెండింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఛాంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్, శివశంకర్ లోతేటితో కలిసి విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై వీసీ ద్వా రా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ హాజరై జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై వివరించారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


