●యూరియా కోసం పాట్లు.. | - | Sakshi
Sakshi News home page

●యూరియా కోసం పాట్లు..

Dec 29 2025 7:58 AM | Updated on Dec 29 2025 7:58 AM

●యూరి

●యూరియా కోసం పాట్లు..

●యూరియా కోసం పాట్లు..

ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం..

రైతులకు శాపం

యూరియా దొరకక అవస్థలు

కడప అగ్రికల్చర్‌ : పట్టెడన్నం పెట్టే రైతన్నలకు ఈ ఏడాది కాలం కలిసిరాలేదు. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ కష్టాల కడలిలో ఎదురీదారు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రతో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి.పెట్టుబడులు రాక భారీగానష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు చంద్రబాబు సర్కార్‌ నిర్వాహకంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి.పంటలకు గిట్టుబాట ధరలు కూడా లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్‌లో సకాలంలో వర్షాలు లేక సాగు మందకొడిగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది రైతులకు సరిగా కలిసి రాలేదు.

సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో...

జిల్లాలో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు వరిపంట నేలకొరిగింది. చిరుపొట్ట దశలో ఉన్న పంటంతా దెబ్బతిని తాలు గింజలు ఏర్పడ్డాయి. కొన్ని కోట్ల వరికంకి సుంకు కాలిపోయి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వరితోపాటు వేరుశనగ, మినుము, కంది, మొక్కజొన్నకు సంబంధించి 2242.7 ఎకరాల్లో, అలాగే ఉల్లిపంటకు 158 హెక్టార్లలో నష్టం జరిగింది. మోంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలతో జిల్లాలో 7500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రుపాయి కూడా విదల్చలేదు. తర్వాత కురిసిన అధిక వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు.

ఉల్లిపంట ఊడ్చిపెటుకుపోయింది..

జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయం. జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోయారు. చాలా మందికి సాగు ఖర్చులు కూడా రాలేదు. చంద్రబాబు సర్కార్‌ మాత్రం జిల్లాలో రెండు ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పంది. దీనిపై వామ పక్షాలు అందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు క్వింటాకు రూ.1200 మద్దతు ధర ప్రకటించినా ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ ధరకు కొనుగోలు చేసే వాళ్లు లేక రైతులు నష్టాపోయారు. చివరకు క్వింటా ధర రూ. 400 నుంచి రూ.200కు పడిపోయింది. దీంతో రైతులు పంటను పొలంలోనే వదిలేశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ఉల్లిరైతు పూర్తిగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వర్షాలకు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తామని చెప్పి కర్నూలు జిల్లాకు ప్రకటించింది. రైతులు ఆందోళన చేయడంతో కడప జిల్లాకు కూడా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఒక్క రైతుకు కూడా చెల్లించలేదు.

ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యం...

విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్‌ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్వార్‌ అధికారంలోకి రాగానే వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కానీ పేరుకు తగ్గ సేవ మాత్రం అందించలేక పోయింది. దీనికితోడు రేషనలైజేషన్‌ పేరుతో కొన్ని రైతు భరోసా కేంద్రాలను మూసి వేసింది. మిగిలిన వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో లక్ష్యం నీరుగారి పోయింది.

ఉచిత పంటల బీమాకు మంగళం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటలబీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. ప్రీమియం ఎప్పుడు చెల్లించాలో తెలియక చాలా మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లింకలేకపోయారు. గత వైఎస్సార్‌సీసీ పాలనలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది.అన్నదాతలు ఎలాంటి దిగులు లేకుండా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గదెనెక్కగానే ఉచిత పంటల బీమాకు చెల్లు చీటి పాడింది. ఆరుతడి పంటలైన అరటి, ఉల్లి, టమాట పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు. దీనికి తోడు సాధారణ రైతులకు కూడా ఒక ఏడాది అన్నదాత సుఖీభవ నిధులను ఎగరకొట్టారు. అలాగే కౌలు రైతులకు మెండిచేయి చూపిస్తూ అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయక పోవడంతో వారు పూర్తిగా నష్టపోయారు. ఇలా 2025 జిల్లా రైతుల పాలిట చీకటి సంవత్సరంగా మారింది.

వర్షాభావంతో ఎండిపోయిన పంటను దున్నేస్తున్న రైతు(ఫైల్‌)

మోంథా తుపాను వర్షాలకు నీటి మునిగిన వరిపంట(ఫైల్‌)

ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపులు, రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.అయినా ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. అది సరిపోక బ్లాకులో కొద్దామంటే దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం అందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం సరిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. చివరకు కొంతమంది రైతులు బ్లాకులో కొనుక్కొని అవసరాలను తీర్చుకున్నారు.

●యూరియా కోసం పాట్లు.. 1
1/5

●యూరియా కోసం పాట్లు..

●యూరియా కోసం పాట్లు.. 2
2/5

●యూరియా కోసం పాట్లు..

●యూరియా కోసం పాట్లు.. 3
3/5

●యూరియా కోసం పాట్లు..

●యూరియా కోసం పాట్లు.. 4
4/5

●యూరియా కోసం పాట్లు..

●యూరియా కోసం పాట్లు.. 5
5/5

●యూరియా కోసం పాట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement