అక్రమంగా ఆన్‌లైన్ చేశారు
గ్రామ పొలం సర్వే నంబర్ 413లో 0.91 సెంట్ల భూమిని 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓర్సు చిన్నయ్య అనే వ్యక్తి బత్తుల తిరుపాలమ్మ అనే మహిళకు సర్వే నంబర్ 416,417లో కొంత భూమిని విక్రయించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో పొరపాటున నా సర్వే నంబర్ 413 నమోదు చేశారు. ఈ పొరపాటును సవరించుకోవాలని బత్తల తిరుపాలమ్మ, నేను అనుకున్నాం. ఇంతలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తిరుపాలమ్మ కుమారుడు శివకుమార్‌ను ఎగదోయడంతో డాక్యుమెంట్ సవరణ ఆగిపోయింది. నేను జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు వేయగా అది నడుస్తోంది. అలాగే 2021లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. సర్వే నంబర్ 413లోని భూమి నా అనుభవంలోనే ఉన్నట్లు గతంలో తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్ కూడా ఉంది. ఓవైపు రిట్ పిటీషన్, జేసీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి నవంబర్‌లో శివకుమార్ పేరిట ఆన్‌లైన్ చేశారు. ఆ భూమిని తహసీల్దార్ ప్రత్యేక శ్రద్దతో తుపాకుల ప్రసాద్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. పలుమార్లు నా సమస్యను అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు.
– గంపా చలపతి, నరసింగుపల్లె, పోరుమామిళ్ల మండలం
గ్రామ పొలం సర్వే నంబర్ 205/5లో 2.13 ఎకరాల భూమి నా పేరిట ఉంది. 2012లో సబ్ డివిజన్ కూడా జరిగింది. నా భర్త జి.శ్రీనివాసులు ప్రొద్దుటూరు టూ టౌన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కాగా, మా భర్త అన్న హద్దులు చెరిపేసి మా భూమి ఆక్రమించారు. సర్వే చేసి హద్దులు నిర్దారించాలని ఆరుసార్లు చలనా కట్టగా, ఆరుసా ర్లు మా బావకు నోటీసులు ఇచ్చారు. అయితే తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేయర్ కోనయ్య, వీఆర్వో సుబ్రమణ్యం సర్వే జరగకుండా అడ్డు పడుతున్నారు. మా భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ విషయంపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆగ్రహించిన మా బావ మా ఇల్లు కూల్చి వేయించారు. ఎస్‌ఐ కేసు తీసుకోలేదు. మైదుకూరు డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే మాపైన కౌంటర్ కేసు నమోదు చేయించారు. – రమణమ్మ, రామేశ్వరం, పోరుమామిళ్ల
అక్రమంగా ఆన్‌లైన్ చేశారు


