ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో శనివారం పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఆయుధ నైపుణ్యాలను పరీక్షించారు. ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


