అన్నదానానికి రూ. లక్ష విరాళం
చక్రాయపేట : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీగండి వీరాంజనేయస్వామి ఆలయంలో ఉన్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు లక్ష రూపాయలు విరాళంగా అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. వేంపల్లె మండలం కత్తలూరు గ్రామానికి చెందిన శివ మాన్విక్‌రెడ్డి రూ.50,116లు, హైదరాబాద్‌కు చెందిన వసంత రూ.50,116లు విరాళం ఇచ్చారన్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా స్వామి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారని పేర్కొన్నారు.
చేపల చెరువుల పరిశీలన
చాపాడు : మండలంలోని కుచ్చుపాప గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువులను శనివారం చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల భూ కొలతల డిప్యూటీ డైరెక్టర్ జయరాజు, ఏడీ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ చేపల చెరువులు 80 ఎకరాల విస్తీరణంలో ఉండగా వీటిని భూ రికార్డులలో 3 ఎల్‌పీఎంలు చేశారని, వీటి స్వరూపంపై రికార్డులను పరిశీలించినట్లు డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ కొలతల ఇన్‌స్పెక్టర్లు పుల్లయ్య, వెంకటేశు, హరి, చాపాడు మండల సర్వేయర్ నాగభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా
స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మిట్స్ ఒప్పందం
కురబలకోట : చైన్నెకు చెందిన హ్యాకర్స్ ఇన్పోటెక్ సంస్థతో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ రామనాధన్ శనివారం తెలిపారు. విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
అన్నదానానికి రూ. లక్ష విరాళం


