పశువుల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు
సిద్దవటం : పాడి పశువులు దొంగలించిన కేసులో చింతకొమ్మదిన్నె, అట్లూరు మండలాలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, సుబ్బరాయుడు అనే పాడి రైతులు వారి గేదెలను సిద్దవటం మండలంలోని కనుమలోపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మేపుకుంటూ రాత్రివేళలో గేదెలను కట్టేసుకుని అక్కడే ఉండేవారు. వారికి ఒక్కొక్కరికి 5 చొప్పున ఉన్న 10 గేదెలను అక్కడే మేపుకునేవారు. ఈ నెల 22వ తేదీన కూడా రోజువారీగా గేదెలను మేపుకుని ఆ రాత్రి అక్కడే కట్టేసుకొని పడుకున్నారు. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున చూసుకుంటే అక్కడ గేదెలు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా గేదెలు కనిపించకపోవడంతో అదే రోజు రైతులు సిద్దవటంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ రెండు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 25వ తేదీ సిద్దవటం మండలం నేకనాపురం క్రాస్ రోడ్డులోని చాముండేశ్వరిపేట వద్ద ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్‌కు చెందిన చినాయాపల్లి జనార్దన్, అట్లూరు మండలం సురాయపల్లి గ్రామానికి చెందిన చప్పిడి వెంకటేష్, చప్పిడి నరసింహులు అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని వి చారించగా 10 గేదెలను దొంగతనం చేసిన విషయా న్ని ముగ్గురు నిందితులు అంగీకరించారు. నేకనాపు రం గ్రామ శివారులోని శివాలయం వద్ద గేదెలను పెట్టి ఒకరిని కాపలా ఉంచినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి ప ది గేదెలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. వారిని శుక్రవారం కోర్టుకు తరలించారు. ము ద్దాయి చినాయపల్లె జనార్దన్‌పై గతంలో 10 కేసులు నమోదై ఉన్నందున అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయుటకు పై అధికారులకు సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపించామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా సకాలంలో ఛేదించిన ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ, పోలీస్ సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు.
80 మద్యం బాటిళ్లు స్వాధీనం


