బాధ్యతల స్వీకరణ
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డెమోగా ఆర్.ప్రసన్నలత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్‌కు రిపోర్టు చేశారు. ఈమె కోరుగుంటపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ హెచ్‌ఈఓగా పనిచేస్తూ పదోన్నతిపై డిప్యూటీ డెమోగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఉమామహేశ్వకుమార్, ఇతర వైద్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం దేవదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో లెక్కించారు. మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాములవారి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.19,24,000 లక్షలు నగదు,22 గ్రాములు బంగారు, 2.400కేజీల వెండి వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాజారెడ్డి, ఆలయ ఈఓ క్రిష్ణానాయక్, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు: జాతీయ స్థాయి అండర్–17 విభాగంలో జమ్మలమడుగుకు చెందిన మంగదొడ్డి ప్రియాంక ఎంపికై నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ సెలెక్షన్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో గుంటూరు జిల్లా తరఫున ఆడి ఫైనల్‌లో తన బౌలింగ్‌లో చిత్తూరు టీమ్‌పై మూడు వికెట్ల తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది. దీంతో ఆమెను అండర్–17 జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఆమె పులివెందులలో నిత్యానందరెడ్డి దగ్గర కోచించ్ తీసుకుందని వివరించారు. జమ్మలమడుగు నుంచి మహిళల అండర్–17 జట్టుకు ఎంపిక కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: పౌర్ణమిని పురస్కరించుకుని జనవరి 2వ తేదీ జిల్లాలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప డిపో నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసు రాయచోటి, పీలేరు మీదుగా అరుణాచలం బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ. 1044 చార్జీగా నిర్ణయించారన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అల్ట్రాడీలక్స్ సర్వీసులు తిరుగుతాయని, ఇందులో రూ. 1282 చార్జీగా ఉందన్నారు. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌మీదుగా సూపర్ లగర్జరీ సర్వీసులు నడుస్తాయని, ఇందులో రూ. 1201 చార్జిగా ఉందన్నారు.ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు మైదుకూరు, కడపమీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఇందులో రూ. 1273 చార్జిగా నిర్ణయించారన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జి రూ. 1363 అని తెలిపారు. పులివెందల డిపో నుంచి ఉదయం 7 గంటలకు రాయచోటి, పీలేరు మీదుగా సూపర్ లగ్జరీ సర్వీసు నడుస్తుందని, ఇందులో చార్జీగా రూ. 1193 చెల్లించాలన్నారు. అంతేకాకుండా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
బాధ్యతల స్వీకరణ
బాధ్యతల స్వీకరణ
బాధ్యతల స్వీకరణ


