జాబ్‌కార్డులు సరిచేశారు
కడప సిటీ: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై కొరడా ఝళిపిస్తోంది. ఏ చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆర్థికంగా దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అందులో భాగంగానే జిల్లాలో జాబ్‌కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నం చేశారు. 10,158 జాబ్‌కార్డులను తొలగించారు. ఈ నేపథ్యంలో సాక్షిలో ఇటీవల పేదల ‘ఉపాధికి ఎసరు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భావనతో గ్రామ సభల ద్వారా 10,158 జాబ్‌కార్డులను తీసి వేయగా, అందులో 5050 మళ్లీ యాక్టివ్ జాబ్‌కార్డులుగా సరిచేశారు. ఈ విషయంపై డ్వామా పీడీని వివరణ కోరగా కేవలం మృతి చెందిన వ్యక్తులవి మాత్రమే తొలగించినట్లు పేర్కొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్:విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు బీఎల్‌ఓలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఓటర్ల జాబితాల ప్రత్యేక తనిఖీ, నవీకరణ కార్యక్రమంలో భాగంగా ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహించినందులకు కమలాపురం నియోజకవర్గం పరిధిలోని సీకే దిన్నె మండలం తాడిగొట్ల గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీగా చేస్తున్న ఎన్.శాంతమ్మ, వల్లూరు మండలం టీజీ పల్లె గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎల్.మారుతీ, వీరపునాయునిపల్లె మండలంలోని అలిదెన గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సి.శివ మహేశ్వర్ రెడ్డి, ఎన్. పాలగిరి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జి. మురళికృష్ణలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఆర్డర్ కాపీలను జారీ చేశారు.


