శ్రీనిధి, వైవీయూ మధ్య అవగాహన ఒప్పందం
కడప ఎడ్యుకేషన్: పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, ఆహార పరిశ్రమ విద్యా సహకారాన్ని ప్రోత్సహించడానికి ప్రొద్దుటూరు శ్రీ నిధి డెయిరీ, కడప యోగి వేమన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. వైవీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ పి. పద్మ, శ్రీనిధి డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రేగంటి సురేష్ బాబు, ప్లాంట్ మేనేజర్ బాలయ్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల డెయిరీ ప్లాంట్ సందర్శన, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టుల నిర్వహణ, ప్లేస్‌మెంట్స్ ఇవ్వడానికి శ్రీనిధి డైరీ వారు ముందుకు వచ్చారని తెలిపారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు పరిశోధనల్లో వారికి సహకరిస్తారని వివరించారు. మార్కెటింగ్ టీంకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రొద్దుటూరులోని విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల, వైవీయూ ఎంబీఏ ఫ్యాకల్టీ సేవలందిస్తారని తెలిపారు. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డీన్, ప్రొఫెసర్ దాము, పీఎం–యుఎస్‌హెచ్‌ఎ కోఆర్డినేటర్ డాక్టర్ టి. చంద్రశేఖర్, ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. రియాజున్నిసా, పీఎం ఉషా సాఫ్ట్ కాంపోనెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


