రిటైర్డు ఈఓపై చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : అగస్త్యేశ్వరస్వామి ఆలయ రిటైర్డు ఈఓ రామచంద్రాచార్యులుపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి బంగారు, వెండి నగల లెక్కింపులో, డబ్బు జమలో అవకతవకలు జరగడం బాధాకరమని తెలిపారు. ఆయన వేలం నిర్వహించేటప్పుడు సమాచారం ఇవ్వరని, అధికారులకు, పత్రికలకు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా జరిపిస్తారన్నారు. నామా ఎరుకలయ్య ఆశ్రమంలోని డైట్ కాలేజీ గదులు, నెల్లూరు జిల్లా భరద్వాజ ఆశ్రమానికి సంబంధించిన గదుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసి అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.


