క్రిస్మస్ ఆనందహేల
లోక రక్షకుడు ఉదయించిన వేళ..
కడప కాంగ్రిగేషనల్ టౌన్ చర్చిలో క్రిస్మస్ ట్రీకి విద్యుద్దీప అలంకరణ, పశువుల పాక సెట్టింగ్
విద్యుద్దీప వెలుగుల్లో క్యాథడ్రల్ చర్చి
విద్యుద్దీప
అలంకరణలో
సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి
కరుణామయుని చల్లని చూపుల ప్రభావమేమో అంతటా వాతావరణం చల్లగా ఉంది. ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. తమశక్తి కొద్ది క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ క్రిస్మస్ తారలు వెలుగులు ప్రసరిస్తున్నాయి. క్రిస్మస్ తాతలు కానుకలతో ఇల్లిల్లూ తిరిగి చిన్నారులకు కానుకలు అందిస్తున్నాడు. శుభవార్తను గంభీరంగా చెబుతున్నట్లు మంద్రంగా చర్చి గంటలు... క్రీస్తుకు వెలుగుల స్వాగతం పలుకుతున్న కొవ్వొత్తులు... గురువుల బోధనలు, విశ్వాసుల ప్రార్థనలు....అంతా క్రిస్మస్ ఆనందహేల. అవును.. శాంతి స్వరూ పుడు, కరుణామయుడు ఏసు భువికి వచ్చిన వేళ! .. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి. గురువారం అర్థరాత్రి పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కడప నగరంలోని కాంగ్రిగేషనల్ టౌన్‌చర్చి, మరియాపురంలోని కేథడ్రల్ చర్చి, సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చి, సంధ్య సర్కిల్‌లోని డాన్‌బాస్కో చర్చి, క్రై స్ట్ చర్చిలతోపాటు జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కలసపాడు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లోని ప్రముఖ చర్చిలలో కూడా గురువారం క్రిస్మస్ పండుగ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కెట్‌లోనూ క్రిస్మస్‌సందడి కనిపించింది.
–కడప సెవెన్‌రోడ్స్
క్రిస్మస్ ఆనందహేల
క్రిస్మస్ ఆనందహేల
క్రిస్మస్ ఆనందహేల
క్రిస్మస్ ఆనందహేల


