● ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాలు మినహా...
జిల్లాలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో సాధారణ సాగుకు మించి శనగపంట సాగైంది. జమ్మలమడుగు మండలంలో సాధారణసాగు 4486 హెక్టార్లుకాగా 5758 హెక్టార్లలో, ఎర్రగుంట్ల మండలంలో సాధారణసాగు 5076 హెక్టార్లుకాగా 5438 హెక్టార్లలో సాగైయింది. మిగతా బాగా సాగయ్యే మండలాలైన వేముల లో సాధారణసాగు 3213 హెక్టార్లకుగాను 2350, కమలాపురంలో 5686 హెక్టార్లకుగాను 4261 , తొండూరు మండలంలో 2435 హెక్టార్లకుగాను 784, లింగాల మండలంలో 2131 హెక్టార్లకుగాను 1250, ప్రొద్దుటూరు మండలంలో 3320 హెక్టార్లకుగాను 2990, రాజుపాలెం మండలంలో 7697 హెక్టార్లకుగాను 5134, సింహాద్రిపురంలో మండలంలో 6826 హెక్టార్లకుగాను 4900, పెండ్లిమర్రి మండలంలో 1863 హెక్టార్లకుగాను 1027, మైలవరం మండలంలో 4008 హెక్టార్లకుగాను 2730 హెక్టార్లలో శనగ సాగైంది.అత్యధికంగా సాగయ్యే మండలాల్లోనే ఈ ఏడాది శనగపంట అంతగా సాగుకాలేదు.


