పలువురికి పదోన్నతులు
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో బుధవారం డిప్యూటీ డెమోగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెల్త్ ఎడ్యుకేటర్స్‌కు డిప్యూటీ డెమోగా పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల ( స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ప్రేమంత్‌కుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 2026 జనవరి 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను కడప ఎన్‌జివో కాలనీలోని సమగ్రశిక్షకార్యాలయంలో అందచేయాలని తెలిపారు.


