డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్నమెంట్‌

Nov 6 2025 7:48 AM | Updated on Nov 6 2025 7:48 AM

డ్రాగ

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

ముకేష్‌ మోక్షజ్ఞ తేజ్‌ అనంతపురం (138 పరుగులు)

ప్రణవ్‌ గోవర్దన్‌, చిత్తూరు

(151 పరుగులు)

కేవీఎస్‌ మణిదీప్‌

చిత్తూరు (90 పరుగులు)

హేమ చందర్‌ నాయక్‌

అనంతపురం (113 పరుగులు)

రక్షణ్‌ సాయి, చిత్తూరు

(3 వికెట్లు)

తరుణ్‌ కుమార్‌ రెడ్డి,

చిత్తూరు (4 వికెట్లు)

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డాగ్రా ముగిసింది. బుధవారం రెండవ రోజు 184 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 66.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ఎస్‌కె సమీర్‌ 33 పరుగులు, సీహెచ్‌ కార్తీ 21 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని తరుణ్‌కుమార్‌ రెడ్డి 4 వికెట్లు, రక్షణ్‌ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 75 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని ప్రణవ్‌ గోవర్దన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. కేవీఎస్‌ మణిదీప్‌ 90 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని మోనీష్‌–1 వికెట్‌, సాయిచరణ్‌–1, తేజోధర్‌ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. చిత్తూరు జట్టులోని తరుణ్‌ కుమార్‌రెడ్డి –1 వికెట్‌, హాఫీజ్‌–1 వికెట్‌ తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

అదే విధంగా కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో అనంతపురం –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 174 పరుగులు ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 72 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఆ జట్టులోని ముకేష్‌ మోక్షజ్ఞ తేజ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 188 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సర్‌తో 138 పరుగులు చేశాడు. హేమచందర్‌ నాయక్‌ 113 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని హేమంత్‌ 2 వికెట్లు, యశ్వంత్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 72 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ రెడ్డి 90 పరుగులు, రిషి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని హేమ చందర్‌ నాయక్‌–1 వికెట్‌, కార్తీక్‌ సాయి–1 వికెట్‌ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 7 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. కర్నూలు జట్టులోని చేతన్‌ సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డాగ్రా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న1
1/5

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న2
2/5

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న3
3/5

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న4
4/5

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న5
5/5

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే టోర్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement