ఆత్మహత్యను నివారించిన పోలీసులు
వల్లూరు : కుటుంబ సమస్యలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని కాపాడి వల్లూ రు పోలీసులు అందరి మన్ననలు పొందారు. వివరాలిలా.. వల్లూరుకు చెందిన షేక్ రసూల్ (36) కుటుంబ సమస్యలతో మనోవేదనకు గురై, బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడుకు ని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.స్థానికుల ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఎస్‌ఐ పెద్ద ఓబన్న ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన పోలీసులు అంజి ప్రసాద్, సురేంద్ర హుటాహుటి న ఘటనా స్థలికి చేరుకుని పట్టాలపై వున్న రసూల్‌ను ట్రాక్‌పై నుంచి పైకి లేపి పక్కకు తీసుకుని వచ్చారు.
ఫంక్షన్‌కు రానన్నందుకే..
భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఫంక్షన్‌న్‌కు రాలేమని చెప్పడంతో మనస్థాపానికి గురైన రసూల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రసూల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడించారు. అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్పగిరిలో బందోబస్తు బాధ్యతల్లో వున్న ఎస్‌ఐ పెద్ద ఓబన్న సెల్‌ఫోన్ ద్వారా రసూల్‌తో మాట్లాడి మానసిక స్థైర్యం కల్పించారు. జీవితం చాలా విలువైనదని, సమస్యలు వస్తే చర్చించుకోవాలి తప్ప వాటి నుండి తప్పించుకోవడం సరి కాదని రసూల్‌కు, అతని కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.


