పరీక్ష వాయిదా వేయాలి
కడప ఎడ్యుకేషన్: నవంబర్ 14వ తేదీ నిర్వహించనున్న సమ్మెటివ్–1 పరీక్షలను వాయిదా వేయాలని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలను నవంబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించాలని విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. నవంబర్ 14న ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉందన్నారు. ఆ రోజు బాలల దినోత్సవమని.. ఆ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖను కోరారు.
కడప అగ్రికల్చర్: గ్రామీణ ప్రాంత రైతుల అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో రెండు సొసైటీలను కొత్తగా రిజిస్టర్ చేశామని జిల్లా సహకారశాఖ అధికారి వెంకటసుబ్బయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ గోపీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కడపలోని జిల్లా సహకార కేంద్రంలో చదిపిరాళ్లకు సొసైటికి సంబంధించిన రిజిస్టర్ కాపీని వారికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ జిల్లాలోని ఖాజీపేట మండలం చెముళ్లపల్లె సొసైటీ, కమలాపురం మండలం చదిపిరాళ్ల సొసైటిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేశామన్నారు. ఈ రెండు సొసైటీలను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఎస్‌జీఎఫ్ క్రీడల్లో భాగంగా అండర్–14 బాల బాలికలకు అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలకు దాదాపు 100 మందికి పైగా క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు చంద్రావతి, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ పీఈటీ అసోసియేషన్ ట్రెజరర్ శివకృష్ణ, నాగేశ్వరావు, కోచ్‌లు మహేశ్వర్ రెడ్డి, రాయుడు, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి
కాశినాయన : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని డీఈఓ షంషుద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని వరికుంట్ల, గొంటువారిపల్లె, నరసాపురం గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. నరసాపురం, గొంటువారిపల్లెలో నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘ఫౌండేషన్ డే‘ను విజయవంతం చేద్దాం
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 7వ తేదీన జరగనున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి జిల్లాలోని ప్రతి ఒక్క యూనిట్ లీడర్ తమ యూనిట్ సభ్యులతో కడప శంకరాపురంలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. త్వరలో జరిగే రాజ్య పురస్కార్, తృతీయ సోపాన క్యాంపునకు సంబంధించిన అప్లికేషన్లను అందజేయాలని తెలిపారు.


