● నేతన్నకు దక్కని భరోసా
జిల్లాలోని చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ఏడాదికి రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని నేతన్న భరోసా కింద అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది ఆగస్టు 7న గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుతోపాటు ఆర్థికసాయం చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సహాయం నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు కారణంగా తమ జీవనం కష్టతరంగా మారిందని పలువురు నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


